ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడా?!
- April 28, 2019
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. తమిళం, తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న 'కాంచన' సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు 'లక్ష్మీ బాంబ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రలో నటించనున్నారు. అక్షయ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటిస్తారు. అయితే 'కాంచన' చిత్రంలో ప్రముఖ నటుడు శరత్‌కుమార్ హిజ్రా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీమేక్‌లో అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే అమితాబ్ పాత్ర గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాధవన్, శోభితా ధూలిపాళ్ల కీలక పాత్రలు పోషించనున్నారు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..