ఎండలు మండిపోతున్నాయి బాబోయ్
- April 28, 2019
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ..భగ లాడుతున్నాడు. రెండు రాష్ట్రాల్లోనూ సూరీడు చెలరేగిపోతున్నాడు. ఏపీలో అయితే ఓ వైపు వేడి.. ఉక్కపోత బెంబేలెత్తిస్తుంటే.. మరోవైపు దూసుకువస్తున్న ఫణి తుపాన్ మరింతగా భయపెడుతోంది. విశాల సముద్రతీరమున్న ఏపీలో ఎండలు మంటపుట్టిస్తున్నాయి. ఫణి తుపాన్ దూసుకువస్తున్నా.. ఉష్ణోగ్రతలు సెగలు పుట్టిస్తున్నాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత రోడ్డెక్కాలంటేనే ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఇంటిపట్టున ఉన్నా ఉక్కపోతతో సతమతమవుతున్నారు. మధ్యాహ్నం మాత్రమే కాదు.. సాయంత్రం, రాత్రుల సయితం వేడి గాలుల ఉధృతి తగ్గడంలేదు. రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 112 ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని అంచనాలున్నాయి. ఆదివారం కూడా ఎండలు గట్టిగా కాస్తున్నాయి. తుపాన్ అతి సమీపంలోకి వస్తే తప్పా భానుడు శాంతించే పరిస్థితి లేదని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..