'ఫకీర్' సినిమా టీజర్ విడుదల
- April 28, 2019
మీరమ్మ ముావీస్ పతాకంపై రూపొందిన సినిమా ఫకీర్. జవానేర్ దివానీ అనేది చిత్ర ఉప శీర్షిక. ఫకీర్ సినిమాకు సుబ్బు దర్శకత్వం వహించారు. కోటేష్ నాయక్ హీరోగా నటించిన ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలించాంబర్ లో జరిగింది. టీజర్ విడుదల అనంతరం దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ… నేను వృత్తిరీత్యా సైనికుడిని. సీఐఎస్ ఫ్(cisf) లో పనిచేస్తున్నాను. దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తుంటాను. సైనికుడిగా నేను చూసిన అనుభవాలతో ఫకీర్ అనే చిత్రాన్ని రూపొందించాను. నమ్మింది నిజం అయితే ప్రపంచం తో కుాడా పైట్ చేసే సాహసం సైనికుడిది. అతని జీవితం ఒక అలజడి. దేశభక్తి, జాతీయ భావాలతో కొందరు ఎలా వ్యాపారం చేస్తున్నారు.? సైనికుల పట్ల సమాజానికి ఉన్న దృక్పథం ఏంటి అనే అంశాలతో ఫకీర్ సినిమా రూపొందించాను. ఈ చిత్రంలో యదార్థ ఘటనల స్ఫూర్తి ఉంది. అన్నారు.
అతిధి tv5 మూర్తి మాట్లాడుతూ… సుబ్బు అప్పుడప్పడు సామాజిక అంశాల గురించి తన ఆలోచనలను చర్చిస్తుండేవాడు. ఒకరోజు తను చేసిన సినిమా గురించి చెప్పాడు. దేశ సైనికులంటే నాకు అమితమైన ప్రేమ అబిమానం. సీఐఎస్ ఫ్(cisf) సైనికుడిగా కర్తవ్యం నెరవేరుస్తు సినిమా చేసిన అతని పట్టుదల గొప్పది. ఫకీర్ సినిమా విజయం సాదించాలని కోరుతున్నాను. అన్నారు.
హీరో కోటేష్ నాయక్ మాట్లాడుతూ.. నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన సుబ్బు గారికి థ్యాంక్స్. బార్డర్ లోని శత్రువుల తో కాదు, సమాజం తో పోరాడలేక ఓడిపోయున ఒక సైనికుడి యదార్థ కద.. ఈ ఫకీర్ . మీ హృదయానికి హత్తుకునేలా చిత్రం ఉంటుంది. అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం జానీ, నిర్మాత శంకర్, మేనేజర్ ఎన్. నవీన్
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







