'ఫకీర్' సినిమా టీజర్ విడుదల
- April 28, 2019మీరమ్మ ముావీస్ పతాకంపై రూపొందిన సినిమా ఫకీర్. జవానేర్ దివానీ అనేది చిత్ర ఉప శీర్షిక. ఫకీర్ సినిమాకు సుబ్బు దర్శకత్వం వహించారు. కోటేష్ నాయక్ హీరోగా నటించిన ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలించాంబర్ లో జరిగింది. టీజర్ విడుదల అనంతరం దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ… నేను వృత్తిరీత్యా సైనికుడిని. సీఐఎస్ ఫ్(cisf) లో పనిచేస్తున్నాను. దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తుంటాను. సైనికుడిగా నేను చూసిన అనుభవాలతో ఫకీర్ అనే చిత్రాన్ని రూపొందించాను. నమ్మింది నిజం అయితే ప్రపంచం తో కుాడా పైట్ చేసే సాహసం సైనికుడిది. అతని జీవితం ఒక అలజడి. దేశభక్తి, జాతీయ భావాలతో కొందరు ఎలా వ్యాపారం చేస్తున్నారు.? సైనికుల పట్ల సమాజానికి ఉన్న దృక్పథం ఏంటి అనే అంశాలతో ఫకీర్ సినిమా రూపొందించాను. ఈ చిత్రంలో యదార్థ ఘటనల స్ఫూర్తి ఉంది. అన్నారు.
అతిధి tv5 మూర్తి మాట్లాడుతూ… సుబ్బు అప్పుడప్పడు సామాజిక అంశాల గురించి తన ఆలోచనలను చర్చిస్తుండేవాడు. ఒకరోజు తను చేసిన సినిమా గురించి చెప్పాడు. దేశ సైనికులంటే నాకు అమితమైన ప్రేమ అబిమానం. సీఐఎస్ ఫ్(cisf) సైనికుడిగా కర్తవ్యం నెరవేరుస్తు సినిమా చేసిన అతని పట్టుదల గొప్పది. ఫకీర్ సినిమా విజయం సాదించాలని కోరుతున్నాను. అన్నారు.
హీరో కోటేష్ నాయక్ మాట్లాడుతూ.. నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన సుబ్బు గారికి థ్యాంక్స్. బార్డర్ లోని శత్రువుల తో కాదు, సమాజం తో పోరాడలేక ఓడిపోయున ఒక సైనికుడి యదార్థ కద.. ఈ ఫకీర్ . మీ హృదయానికి హత్తుకునేలా చిత్రం ఉంటుంది. అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం జానీ, నిర్మాత శంకర్, మేనేజర్ ఎన్. నవీన్
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం