ఫణి తుపాను.. అప్‌డేట్

- April 28, 2019 , by Maagulf
ఫణి తుపాను.. అప్‌డేట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాన్ మరింత బలపడుతోంది. దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30 నుంచి 31 డిగ్రీల వరకు ఉండడంతో తుపాను తీవ్రత పెరుగుతోంది. అంతకంతకూ బల పడుతున్న ఫణి, వచ్చే 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారి తమిళనాడు-కోస్తాంధ్ర తీరా లకు సమీపంలో కేంద్రీకృతం కానుంది. రాబోయే 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారి తీర ప్రాంతాలపై విరుచుకుపడనుంది.

ఫణి తుపాను ప్రస్తుతం వాయవ్య దిశగా పయనిస్తోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న సైక్లోన్.. మంగళ వారం సాయంత్రానికి తీరాన్ని చేరనుంది. తీరం తాకిన తర్వాత దిశను మార్చుకొని ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు రానుంది. అతి తీవ్ర తుఫానుగా బలపడే క్రమంలో సైక్లోనే పయనం మంద గించే అవకాశముందని వాతా వరణశాఖ పేర్కొంది. ఈనెల 30 సాయంత్రానికి ఫణి తుఫాను దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది.

ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు తుపాను ప్రభావం ఉండనుంది. అతితీవ్ర తుఫాను తీరానికి దగ్గరగా వస్తే ఏప్రిల్ 30, మే 1వ తేదీల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాల్లో విస్తారంగావర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి బల మైన గాలులు వీస్తాయి. ఒకవేళ తీరానికి దూరంగా తుఫాను దిశ మార్చుకుంటే మాత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. మే 2న ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతా వరణశాఖ సూచించింది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమా దముందని హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారు తుందని వార్నింగ్ ఇచ్చింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని కలెక్టర్లు సూచించారు.

తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని అధి కారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com