'స్పిరిట్‌ ఆఫ్ జెర్సీ' వీడియో పాట విడుదల

'స్పిరిట్‌ ఆఫ్ జెర్సీ' వీడియో పాట విడుదల

హైదరాబాద్‌: నాని కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నాని నటన, గౌతమ్‌ దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. కాగా ఆదివారం చిత్రబృందం థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువకథానాయకుడు రానా విచ్చేశారు. సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక బృందానికి జ్ఞాపికలు అందజేసి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా 'స్పిరిట్‌ ఆఫ్‌ జెర్సీ' పూర్తి వీడియో సాంగ్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటను కాలభైరవ ఆలపించారు.

Back to Top