గాజాలో ఇజ్రాయిలీ దళాల కాల్పులు

గాజాలో ఇజ్రాయిలీ దళాల కాల్పులు

గాజా:గాజా స్ట్రిప్‌లో శుక్రవారం ఇజ్రాయిలీ దళాలు జరిపిన కాల్పుల్లో 60 మంది గాయపడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రతివారాంతంలో జరిగే గ్రేమ్‌ మార్చ్‌ ఆఫ్‌ రిటర్న్‌ ర్యాలీల్లో భాగంగానే శుక్రవారం కూడా పాలస్తీనీయులు ప్రదర్శన నిర్వహించగా, ఇజ్రాయిలీ దళాలు అడ్డుకున్నాయి. గాజాలో పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి అష్రఫ్‌ అల్‌ ఖద్రా మాట్లాడుతూ, ఇజ్రాయిలీ దళాల కాల్పుల్లో గాయపడిన 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 19 మంది చిన్నారులు కూడా వున్నారని తెలిపారు. గాజా స్ట్రిప్‌లో పాలస్తీ నీయులు వరుసగా56 వారం ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు.

Back to Top