120,000 అక్రమ వలసదారుల కోసం వేట

120,000 అక్రమ వలసదారుల కోసం వేట

కువైట్‌:దేశంలో 120,000 మంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారనే అంచనాలతో మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ఆయా వ్యక్తుల జాడ కనుగొనేందుకు సంబంధిత శాఖల ద్వారా 'వేట' కొనసాగిస్తోంది. ఉల్లంఘనుల్లో కొందరు తమ రెసిడెన్స్‌ పర్మిట్‌ని వివిధ కారణాలతో రెన్యూ చేసుకోలేకపోయినట్లు మినిస్ట్రీ భావిస్తోంది. అలాగే మరికొందరు విజిట్‌ వీసాలపై వచ్చి, ఆ తర్వాత గడువు తీరినా దేశం విడిచి వెళ్ళకుండా వుండిపోయినట్లు పేర్కొంటున్నారు అధికారులు. అయితే, ఏ కారణాలతో అయినా అక్రమ నివాసితులుగా వున్నవారిని అరెస్ట్‌ చేయడం తప్పనిసరి అని మినిస్ట్రీ చెబుతోంది. కాగా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిపోర్టేషన్‌ గత కొద్ది రోజుల్లో 620 మంది వలసదారుల్ని డిపోర్ట్‌ చేయడం జరిగింది. వీరిలో 18 మంది మహిళలు వున్నారు. డిపోర్టేషన్‌ సెంటర్‌ కెపాసిటీ 800 మంది మాత్రమే. 

Back to Top