‘ఢీ’ డాన్స్ మాస్టర్.. ఎయిర్ హోస్టెస్‌తో పెళ్లి..

‘ఢీ’ డాన్స్ మాస్టర్.. ఎయిర్ హోస్టెస్‌తో పెళ్లి..

బుల్లితెర యంగ్ టాలెంట్లకు వేదిక. ఢీ డాన్స్ షో ద్వారా పాపులరైన కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ సినిమాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకున్నారు. కాగా యశ్వంత్ 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తన ప్రేయసి వర్షను అర్ధాంగిగా చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితురాలైన వర్షను కాలేజీలో చదివే రోజుల్నించి ఇష్టపడ్డారు యశ్వంత్. ఇద్దరి అభిరుచులు కలవడంతో వారి స్నేహం ప్రేమగా మారింది. అయితే లైఫ్‌లో సెటిలైన తరువాతే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ. తమ కెరీర్‌పైన దృష్టి పెడుతూ వర్ష ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా, యశ్వంత్ డాన్స్ మాస్టర్‌గా వారి వారి రంగాల్లో సెటిల్ అయ్యారు. ఈలోపు వీరి పెళ్లికి పెద్దల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆనందంగా వర్షతో ఏడడుగులు నడిచాడు.. మూడు ముళ్లు వేశాడు యశ్వంత్.

Back to Top