ముగ్గురు నేర ప్రేరపితులకు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు

- January 01, 2016 , by Maagulf
ముగ్గురు నేర ప్రేరపితులకు వ్యతిరేకంగా  న్యాయపరమైన చర్యలు

  దేశ భద్రతకు వాటిల్లే విధంగా ఒక సమావేశంలో పాల్గొన్న నెరరొపణపై  7 గురికి వ్యతిరేకంగా  న్యాయ పరమైన చర్యలకు ఆదేశాలు జారీ కాబడ్డాయి.జనరల్ డైరెక్టర్ అఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్  మరియు ఫోరెన్సిక్ సైన్స్ ప్రకటించింది. ఈ ఏడుగురు నిందితులలో నల్గురి నుంచి వివరణ తీసుకోగా , మిగిలిన ముగ్గురిని విచారించిన  అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు పంపించారు. గత నెల డిసెంబర్ 27 వ తేదీన జరిగిన ఒక సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా వీరు శాసనాధికారాల ధిక్కరణలకు పాల్పడి  దేశ భద్రతకు వ్యతిరేకంగా ద్వేషాన్ని కూడగట్టేందుకు పలువురిని ఆకర్షించేందుకు సమావేశం వారు జరిపినట్లు జనరల్ డైరెక్టర్ తెలిపారు. 
   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com