'NGK' మూవీ ట్రైలర్ విడుదల
- April 29, 2019
హైదరాబాద్: సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఎన్జీకే'. ఈ సినిమాలో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ సాయంత్రం విడుదల చేశారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఒక చిన్న గుంపును వేసుకొని రాజకీయాల్లోకి వచ్చేస్తే.. నిన్ను రానిస్తారు అనుకున్నావా? అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. డ్రీవ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాను మే 31 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సూర్య నటిస్తోన్న మరో చిత్రం 'కాప్పాన్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాప్పాన్ సినిమా ఆగస్టులో ప్రేక్షక్షుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..