ఏంటి.. బిగ్‌బాస్ హోస్ట్ నయనతారా!!
- April 30, 2019
నటీనటులకి తాము నటించిన సినిమాలకి సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడమే రాదు. మరి అలాంటిది ఓ టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా.. అందునా తెలుగు షోకి మలయాళ నటిని ఎంపిక చేసారా.. అంటే.. వచ్చీ రానీ తెలుగులో మాట్లాడడమే ఫ్యాషన్ అని అంటారు. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా వెలిగిపోతూ, లేడీ హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయన్ టీవీ షో చేయడానికి ఒప్పుకుందన్నదాంట్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. తను నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకే దూరంగా ఉండే నయన్ బుల్లితెరపై షో చేయడానికి వస్తుందంటే నిజంగా విశేషమే.
అయితే ఇదంతా పబ్లిసిటీ కోసం ఓ ఛానల్ చేసిన ప్రయత్నమని తెలిసింది. అసలు విషయానికి వస్తే నయనతార నటించిన నోడిగళ్ చిత్రం మే 12న ఆ ఛానల్‌లో ప్రసారం కానుందట. అందుకోసమే ఇలా ఓ వింత వార్తను సృష్టించి ప్రసారం చేసారు. మరి ఇంతకు ముందు వచ్చిన వార్త బిగ్‌బాస్ 3 సీజన్‌కి అనుష్క హోస్ట్ అని. అందులో కూడా ఎంత నిజముందో.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..