మే 2న తెలంగాణ బంద్‌

- April 30, 2019 , by Maagulf
మే 2న తెలంగాణ బంద్‌

తెలంగాణలో ఇంటర్ బోర్డు అరాచకాలపై ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వచ్చే నెల రెండో తేదీ వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఎంతగా నిర్బంధానికి పాల్పడినా.. తొలిరోజు ధర్నా విజయవంతం అయిందన్నారు. మే ఒకటో తేదీన కొవ్వుత్తుల ర్యాలీకి అఖిలపక్షం ప్లాన్‌ చేసింది. చనిపోయిన విద్యార్థులకు ట్యాంక్‌బండ్‌పై నివాళి అర్పించనున్నారు. మరణించిన ప్రతి విద్యార్థి కుటుంబాన్ని కలుస్తామని నేతలు చెప్పారు.

బీజేపీ కార్యాలయంలో నిన్న దీక్షకు దిగిన ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను.. పోలీసులు అరెస్టు చేసి.. బలవంతంగా నిమ్స్‌కు తరలించారు. వైద్యం తీసుకునేందుకు నిరాకరించిన ఆయన.. నిరశన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇవాళ ప్రగతి భవన్‌ ముట్టడికి కమలనాథులు కదలనున్నారు. మే 2న తెలంగాణ బంద్‌కు లక్ష్మణ్‌ పిలుపిచ్చారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి.. భవిష్యత్‌లో రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అటు ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్ యూనియన్ల నిరసనలు కొనసాగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com