కోకాపేటలో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్
- April 30, 2019హైదరాబాద్ శివారు ప్రాంతంలోని కోకాపేటలో నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ మూవీ చిత్రీకరణ జరపనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం మరోసారి పూణేకి వెళ్ళనుంది. అక్కడ పెండింగ్ షెడ్యూల్ పూర్తి చేయనున్నారు. అనుకున్న టైంకి చిత్రీకరణని పూర్తి చేసి జూలై 30,2020న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకుడు రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతున్నాడు. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలియా భట్ .. చరణ్‌కి జోడీగా నటించనుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా