నగ్నంగా నడక: మహిళకు రెండేళ్ళ జైలు శిక్ష
- May 01, 2019
బహ్రెయిన్: గత ఏడాది నవంబర్‌లో ఓ మహిళ, రోడ్డుపై నగ్నంగా నడిచి వెళ్ళిన ఘటనలో, సదరు మహిళకు న్యాయస్థానం రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ శిక్షను హై అప్పీల్స్ కోర్టు తాజాగా సమర్థించింది. ఆ సమయంలో నిందితురాలు డ్రగ్స్ మత్తులో వున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు 150 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించారు. కాగా, నిందితురాలి బాయ్‌ఫ్రెండ్‌కి సైతం ఏడాది జైలు శిక్ష, 1,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విదించడం జరిగింది. పైకోర్టులో వీరి అప్పీల్‌ని తిరస్కరించడం జరిగింది. నిందితురాలు రోడ్డుపై నగ్నంగా వెళుతుండగా, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. టుబ్లి వద్ద షేక్ సల్మాన్ హైవే పై ఈ ఘటన జరిగింది. నిందితురాలు కింగ్‌డమ్‌లోని ఓ రిసార్ట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







