కన్ఫర్మ్: మహేశ్ కోసం వెంకీ, విజయ్ దేవరకొండ రెడీ
- May 01, 2019
మహేశ్ బాబు 25వ చిత్రం'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనుంది. హైదరాబాద్‌లోని నెక్లస్‌రోడ్‌లో ఈ కార్యక్రమం జరగనుండగా.. దీనికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేశ్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ రానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కోసం వెంకటేశ్, మహేశ్ బాబు తొలిసారిగా కలిసి నటించగా.. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో గతంలో మహేశ్ నటించిన 'శ్రీమంతుడు' ఆడియో ఫంక్షన్‌కు కూడా వెంకటేశ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చిన్న హీరోల ఫంక్షన్‌లకు అతిథిగా రాగా.. తొలిసారిగా ఓ పెద్ద స్టార్ నటుడికి గెస్ట్‌గా మారడం విశేషం.
కాగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'మహర్షి' చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దిల్ రాజ్, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మహేశ్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం కావడం, ఇప్పటికే రిలీజైన టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో 'మహర్షి'పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







