కపిల్ లుక్‌లో రణ్‌వీర్‌ అదుర్స్

కపిల్ లుక్‌లో రణ్‌వీర్‌ అదుర్స్

భారత క్రికెటర్ కపిల్‌దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 83 . 1983 ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నాడు. కపిల్‌దేవ్ మేనరిజమ్స్, స్టైల్స్ ను అనుకరిస్తున్న రణ్ వీర్..83 చిత్రానికి సంబంధించిన తన రెట్రో లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కపిల్ తరహాలో జులపాలతో ఉన్న రణ్‌వీర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ రెట్రో లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Back to Top