పేరు మార్చి హిట్ కొట్టిన మెగా మేనల్లుడు
- May 01, 2019
వరుస ఫ్లాపులతో విసిగిపోయిన సాయిధరమ్ తేజ్... సాయితేజ్ గా పేరు మార్చుకుని `చిత్రలహరి`లో నటించాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్తూ అటు విమర్శకుల ఇటు ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది. చిత్రలహరి ఇచ్చిన ఉత్సాహంతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట సాయితేజ్. ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. గతంలో మారుతితో భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం అందుతోంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను మారుతి తన దైన శైలిలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తునట్లు తెలుస్తోంది. అలాగే ఇంకా రెండు ప్రాజెక్ట్స్ కూడా సాయితేజ్ ఒప్పుకున్నాడని సమాచారం. మొత్తానికి పేరు మారడంతో సాయితేజ్ ఫేట్ మారిందంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







