తెలుగు రాక్ స్టార్ శ్రీరామ్ అల్లూరి కొత్త ఆల్బమ్..మే 4న విడుదల

తెలుగు రాక్ స్టార్ శ్రీరామ్ అల్లూరి కొత్త ఆల్బమ్..మే 4న విడుదల

'రాక్ ఎన్ రోల్' అంటే అందరికీ ఇంగ్లీష్ పాటలే గుర్తుకు వస్తాయి. అయితే ఈ ప్రక్రియలో తొలిసారి మన గొంతుకై నిలిచాడు శ్రీరామ్ అల్లూరి. తెలుగు భాషా మధురిమలను అంతర్జాతీయంగా పంచుతున్న ఈ హైదరాబాదీ.. తెలుగు పాటకు కొత్తందాలను సమకూరుస్తున్నాడు. యూకేలో వినిపిస్తున్న ఈ పడమటి సంధ్యారాగానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. శ్రీరామ్ రూపొందించిన కొత్త ఆల్బమ్ ''ఓ కథ: టేల్స్ ఆఫ్ దిస్ తెలుగు మ్యాన్'' ఈ నెల 4న విడుదల కానుంది. ఇటాలియన్ మ్యూజిక్ బ్యాండ్‌తో కలిసి చేస్తున్న తొలి తెలుగు ఆల్బమ్ ఇది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన శ్రీరామ్.. ఏపీ, తెలంగాణలోని యూనివర్సిటీలలో లైవ్ మ్యూజిక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. దీనివల్ల యువత నుంచి ఫీడ్ బ్యాక్ పొందొచ్చన్నారు. లైవ్ మ్యూజిక్ చేయడమంటే తనకు చాలా ఇష్టమన్నారు. స్వయంగా పాటలు రాసి, మ్యూజిక్ చేయడంపైనే ఎక్కువ ఆసక్తి ఉందన్నారు. తనకు ప్రశంసలు కన్నా..తనలోని నెగిటీవ్ పాయింట్లే ఎక్కువగా గుర్తుంటాయని.. వాటి నుంచే ఎక్కువగా నేర్చుకుంటానన్నారు. టాలీవుడ్ నుంచి అవకాశం వచ్చిందని.. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదన్నారు.

Back to Top