దర్బార్ సెట్‌పై రాళ్ళు విసిరిన అభిమానులు..

అభిమానుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటే వాటిని ఆపడం కష్టతరం. ఈ మధ్య కాలంలో అభిమానులు తమ అభిమాన హీరో షూటింగ్ లొకేషన్ వివరాలు తెలుసుకొని డైరెక్ట్‌గా అక్కడికి వచ్చేస్తున్నారు. దీంతో షూటింగ్‌కి కొంత ఇబ్బంది కలుగుతుంది. విజయ్ 63వ మూవీ చిత్రీకరణ సమయంలో ఇలాంటి సంఘటనే జరిగింది. తాజాగా రజనీకాంత్‌- మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దర్భార్ షూటింగ్ స్పాట్‌కి కొందరు స్టూడెంట్స్ రావడంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. దీంతో ఆగ్రహించిన స్టూడెంట్స్ సెట్‌పై రాళ్ళు విసిరారట. చాలా ఏళ్ళ తర్వాత రజనీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రం దర్భార్. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల పలు ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. దీంతో చిత్ర బృందం కాస్త స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తుంది. ఇది నచ్చని అభిమానులు చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి దుశ్చర్యకి పూనుకున్నారట. అభిమానుల ప్రవర్తనతో చిత్ర బృందం వేరే లొకేషన్‌లో మూవీ చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తుంది.

Back to Top