‘సైరా’ సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం
- May 03, 2019
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంబంధిచిన సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ఉన్న అల్లు అరవింద్ ఫాంహౌస్‌లో ఈ సెట్ ఉంది. నిన్న రాత్రి సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చిత్ర యూనిట్ అప్రమత్తమై మంటలు ఆర్పేలోపే చాలా నష్టం వాటిల్లింది. ఫైరింజన్ కూడా వచ్చి మంటలు ఆర్పేసరికి.. సెట్‌లో చాలా భాగం కాలిపోయింది. ఈ ఘటనలో 2 కోట్ల రూపాయల వరకూ ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రమాదం కారణంగా మిగతా షూటింగ్‌కి ఏమైనా ఇబ్బంది ఉందా.. అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రొడ్యూసర్ రామ్‌చరణ్ కూడా ప్రమాదానికి గల కారణాలపై మీడియాతో మాట్లాడలేదు. దీంతో.. మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







