'తెనాలి రామకృష్ణ.. కేసులివ్వండి ప్లీజ్'
- May 07, 2019
యువ కథానాయకుడు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తు్న్న చిత్రం 'తెనాలి రామకృష్ణ'. 'కేసులివ్వండి ప్లీజ్' అన్నది ఉపశీర్షిక. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు సందీప్ కిషన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లాయర్ గెటప్‌లో తాపీగా కుర్చీపై కూర్చుని చేతులెత్తి దండం పెడుతున్నట్లుగా ఉన్న ఈ లుక్ ఫన్నీగా ఉంది. ఇందులో హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మరోపక్క ఆయన 'నిను వీడని నీడను నేనే' అనే మరో థ్లి్లర్ చిత్రంతోనూ బిజీగా ఉన్నారు. కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో సందీప్ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..