ఏపీలో దాడులకు ఉగ్రవాదుల కుట్ర!

- May 08, 2019 , by Maagulf
ఏపీలో దాడులకు ఉగ్రవాదుల కుట్ర!

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కే పరిమితమైన ఉగ్రవాదులు తమ లక్ష్యం మార్చుకుంటున్నారు. ఏపీని కూడా టార్గెట్ గా చేసుకుంటున్నారు. శ్రీలంకలో దాడులకు తెగబడిన ఉగ్రవాదులు..ఆంధ్రప్రదేశ్ లోనూ విధ్వంసం సృష్టించాలనే పన్నాగంలో ఉన్నట్లు కౌంటర్ ఇంటలిజెన్స్ రిపోర్ట్ చేసింది. ప్రధానంగా మైనారిటీలు ఎక్కువగా ఉండే జిల్లాలను షెల్టర్ జోన్ గా మార్చుకొని దాడులకు పథక రచన చేయనున్నట్లు కౌంటర్ ఇంటలిజెన్స్ తెలిపింది. దీంతో అలర్టైన ఏపీ డీజీపీ ఆల్ యూనైట్ ఆఫీసర్స్ తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల కుట్రలను ధీటుగా ఎదుర్కునే మార్గాలపై అధికారులతో సమీక్షించారు.

ఏపీలో దాడులకు ప్రధానంగా రెండు రకాల వనరులను ఉపయోగించుకునేలా పథక రచనలో ఉన్నారు ఉగ్రవాదులు. ఒకటి స్తానికంగా ఉండే ఓ వర్గం యువతను ట్రాప్ చేసి దాడులకు ఉసిగొల్పటం..లేదంటే ఎంపిక చేసిన ఉగ్రవాదులను ఏపీకి పంపించి దాడులకు తెగబడటం. ఈ ఆపరేషన్ లో భాగంగా..ఇప్పటికే అమాయక యువకులను సోషల్ మాధ్యమాల ద్వారా ట్రాప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కౌంటర్ ఇంటలిజెన్స్ గుర్తించింది. మతపరమైన సమస్యలను తెరపై చర్చిస్తూ..భావోద్వేగాలను రెచ్చగొట్టి యువకులను లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన రిపోర్ట్ లో తెలిపింది. ముఖ్యంగా గుంటూరు, కర్నూలు, అనంతపురం,నంద్యాలను అవాసాలుగా మార్చుకోవాలని కుట్ర చేస్తున్నట్లు వివరించింది.

కౌంటర్ ఇంటలిజెన్స్ రిపోర్ట్ తో డీజీపీ ఠాకూర్ ఆల్ యూనిట్ ఆఫీసర్స్ తో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కౌంటర్ ఇంటలిజెన్స్ ఎస్పీ భాస్కర్ భూషణ్ దాదాపు 20 నిమిషాల పాటు ఉగ్రవాద ముప్పుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఏపీలోకి వీఐపీలు, పర్యాటక, ఆథ్యాత్మిక ప్రదేశాల భద్రతతో పాటు, రాష్ట్రంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ముంబై తరహాలో బోటులు, షిప్పుల్లో ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉండటంతో…విమానాశ్రయాల్లో భద్రత తరహాలోనూ నౌకాశ్రయాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేయాలనే అధికారులు సూచించారు.

అనంతరం ఏస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ..ఆయా జిల్లాల్లో పరిస్థితులు, ఉగ్రవాదుల కదలికలపై పెట్టాల్సిన నిఘా పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాపై కూడా నిఘా పెంచాల్సిన అవసరాన్ని వివరించారు. జనసంద్రం ఎక్కువుగా ఉన్న ప్రాంతాలతో పాటు ఐకాన్ ప్రాంతాలయిన తిరుమల తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీహరికోట, వైజాగ్ సిటీ, కాకినాడ రిలయన్స్, ONGCకి భద్రత పెంచాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com