భారీ ఎన్కౌంటర్.. 5గురు మావోయిస్టుల మృతి
- May 08, 2019
ఒడిశాలోని కోరాపుట్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. కోరాపుట్ జిల్లా పాడువా పీఎస్ పరిధిలోని కిటువకంటి సమీపంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరువర్గాల మధ్య కాల్పులతో కాసేపు ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఘటనా స్థలంలో 3 ఎస్సెల్లార్‌లు, 2 ఇన్సాస్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టులు మకాం వేసినట్టు పక్కా సమాచారం రావడంతో.. ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







