ఇస్తాంబుల్ ఎన్నిక రద్దుపై టర్కీ కమ్యూనిస్టు పార్టీ నిరసన
- May 09, 2019
ఇస్తాంబుల్ : ఇస్తాంబుల్ నగరపాలక సంస్థ ఎన్నికలను రద్దు చేయాలన్న అధ్యక్షుడు ఎర్డోగాన్ నిర్ణయాన్ని సమర్ధించిన టర్కీ సుప్రీం ఎలక్షన్ కౌన్సిల్ (వైఎస్కె) నిర్ణయాన్ని టర్కీ కమ్యూనిస్టు పార్టీ నిరసించింది. ఎర్డోగాన్ నిర్ణయాన్ని సమర్ధించటం ద్వారా వైఎస్కె ప్రజల ఓటు హక్కును కాలరాసిందని ఒక ప్రకటనలో విమర్శించింది. గత మార్చి 31న పూర్తయిన ఎన్నికలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని దీర్ఘకాలం సాగదీసి చివరకు నిర్ధారించటం ద్వారా వైఎస్కె ఎర్డొగాన్ బలహీనతను వెల్లడించటంతో పాటు దేశంలో రాజకీయ సంక్షోభం మరింత పెరిగేందుకు దోహదపడుతుందని తెలిపింది. తమ ఇష్టం వచ్చిన వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకునే హక్కు ప్రజలకున్నదన్న విషయాన్ని అటు ఎర్డోగాన్తోపాటు ఇటు వైఎస్కె కూడా విస్మరించిందని వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు