కాలింగ్ బెల్ మోగింది.. డోర్ తీద్దామనుకునేలోపు..
- May 09, 2019
అమెరికా:కాలింగ్ బెల్ మోగింది.. ఈ టైంలో ఎవరొచ్చుంటారబ్బా అనుకుంటూ ఎందుకైనా మంచిదని విండోలో నుంచి చూసింది.. అంతే ఒక్కసారిగా కాళ్లు ఆడలేదు. భయంతో బిక్కచచ్చిపోయింది. దేవుడా.. తలుపు తీసుంటే నా గుండె అక్కడే ఆగిపోయేది అనుకుంది. ఇంతకీ వచ్చింది ఎవరనుకుంటున్నారు. దొంగైతే కాదు. మరి ఇంకెవరు.. అదేనండి అనుకోని అతిధి.. ఓ మొసలి. నీళ్లలో ఉండీ ఉండీ బోర్ కొట్టేసిందేమో రొడ్డెక్కేసి ఎంచక్కా ఓ మాంచి ఇల్లు చూసుకుని మకాం మార్చాలనుకుందేమో వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ పిలిచింది. ఈ విచిత్ర ఘటన యూఎస్‌లోని సౌత్ కరోలినాలో చోటు చేసుకుంది. కరెన్ అల్ఫానో అనే మహిళ ఇంటి ముందుకు ఓ మొసలి వచ్చి డోర్ బెల్ కొట్టింది.
బెల్ అందకపోయినా తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. ట్రై చేసి ఎలాగైనా సాధించింది. అసలింతకీ బెల్ కొట్టాలని, అది కొడితే డోర్ తీస్తారని దానికి ఎలా తెలిసిందో. ఏవిటో కొన్నిటికి ఆన్సరే ఉండదు. ఏదో ట్రైనింగ్ తీసుకున్నట్టు చేసింది. బెల్ మోగ్గానే లోపల ఉన్న ఆమె డోర్ తీయకుండా కిటీకీలో నుంచి చూసింది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు కాసేపు. తను చూసింది నిజమే అని నిర్ధారించుకున్నాక పోలీసులకు కాల్ చేసింది. వారు జంతు సంరక్షణా సిబ్బందిని తీసుకుని ఆమె ఇంటికి వచ్చారు. మొసలిని చాక చక్యంగా బంధించి తీసుకు పోయి దాని నివాస స్థలంలో వదిలేశారు. ఇదంతా సీసీటీవీలో రికార్డవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







