కాలింగ్ బెల్ మోగింది.. డోర్ తీద్దామనుకునేలోపు..
- May 09, 2019అమెరికా:కాలింగ్ బెల్ మోగింది.. ఈ టైంలో ఎవరొచ్చుంటారబ్బా అనుకుంటూ ఎందుకైనా మంచిదని విండోలో నుంచి చూసింది.. అంతే ఒక్కసారిగా కాళ్లు ఆడలేదు. భయంతో బిక్కచచ్చిపోయింది. దేవుడా.. తలుపు తీసుంటే నా గుండె అక్కడే ఆగిపోయేది అనుకుంది. ఇంతకీ వచ్చింది ఎవరనుకుంటున్నారు. దొంగైతే కాదు. మరి ఇంకెవరు.. అదేనండి అనుకోని అతిధి.. ఓ మొసలి. నీళ్లలో ఉండీ ఉండీ బోర్ కొట్టేసిందేమో రొడ్డెక్కేసి ఎంచక్కా ఓ మాంచి ఇల్లు చూసుకుని మకాం మార్చాలనుకుందేమో వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ పిలిచింది. ఈ విచిత్ర ఘటన యూఎస్‌లోని సౌత్ కరోలినాలో చోటు చేసుకుంది. కరెన్ అల్ఫానో అనే మహిళ ఇంటి ముందుకు ఓ మొసలి వచ్చి డోర్ బెల్ కొట్టింది.
బెల్ అందకపోయినా తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. ట్రై చేసి ఎలాగైనా సాధించింది. అసలింతకీ బెల్ కొట్టాలని, అది కొడితే డోర్ తీస్తారని దానికి ఎలా తెలిసిందో. ఏవిటో కొన్నిటికి ఆన్సరే ఉండదు. ఏదో ట్రైనింగ్ తీసుకున్నట్టు చేసింది. బెల్ మోగ్గానే లోపల ఉన్న ఆమె డోర్ తీయకుండా కిటీకీలో నుంచి చూసింది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు కాసేపు. తను చూసింది నిజమే అని నిర్ధారించుకున్నాక పోలీసులకు కాల్ చేసింది. వారు జంతు సంరక్షణా సిబ్బందిని తీసుకుని ఆమె ఇంటికి వచ్చారు. మొసలిని చాక చక్యంగా బంధించి తీసుకు పోయి దాని నివాస స్థలంలో వదిలేశారు. ఇదంతా సీసీటీవీలో రికార్డవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు