'రాబర్ట్'లో ప్రతినాయకుడుగా జగ్గుభాయ్
- May 10, 2019బెంగళూరు: ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు తమ అభినయ విశ్వరూపాన్ని మరోసారి కన్నడిగులకు చూపనున్నారు. నిఖిల్‌కుమారస్వామి కథానాయకుడిగా 'జాగ్వార్' సినిమాలో నటించిన జగపతి బాబు తొలిసారిగా ఛాలెంజింగ్‌స్టార్ దర్శన్ నటిస్తున్న 'రాబర్ట్' సినిమాలో ప్రతినాయకుడుగా నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం సన్నివేశాన్ని బెంగళూరులోని బనశంకరిలో చిత్రీకరించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. రాబర్ట్ సినిమాలో ఐశ్వర్యా రాయ్ నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇది గాలివార్త అని తరువాత తెలిసింది. త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడికానున్నాయి. తరుణ్‌సుధీర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..