రూ.999కే ఇండిగో భారీ ఆఫర్
- May 15, 2019
న్యూఢిల్లీ: బిజినెస్ క్లాస్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణం చేయాలనుకున్నారా? అయితే ఇండిగో మంచి ఆఫర్ ఇచ్చింది. దేశీయ మార్గాల్లో ప్రయాణానికి రూ.999 నుంచి, ఇంటర్నేషనల్ రూట్లలో రూ.3499 నుంచి టికెట్లు బుక్ చేస్తున్నామని ఇండిగో మంగళవారం తాజాగా ప్రకటించింది.
మంగళవారం ప్రారంభమైన అమ్మకాలు గురువారం (ఈనెల 16) వరకు కొనసాగుతాయని తెలిపింది. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 28 మధ్య ప్రయాణానికి వీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. దేశంలోని 53 ప్రాంతాలకు, ఇంటర్నేషనల్‌గా పదిహేడు మార్గాల్లో ఈ ఆఫర్ ఉందని తెలిపింది. మొత్తం 10 లక్షల సీట్లు ఆఫర్ కింద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
10 లక్షల సీట్లు ఫర్ సేల్: రూ.999కే ఇండిగో భారీ ఆఫర్
వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించామని, మే 16 వరకు జరిగే బుకింగ్స్ పైన ఆఫర్ వర్తిస్తుందని సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పేర్కొన్నారు. ప్రీపెయిడ్ అధిక బ్యాగేజీపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఉంది.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!