కేటీఆర్ అన్నా.. మీరే నన్ను కాపాడాలని వేడుకున్న తెలంగాణ వాసి
- May 15, 2019
సౌదీ అరేబియా:ఉన్న ఊరిలో ఉపాధి లేక.. పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లాడు. బ్రోకర్ చెప్పిన పనికి.. ప్రస్తుతం అక్కడ చేసే పనికి పొంతన లేకపోవడంతో యాతన పడుతున్నాడు. ఎడారిలో గొర్రెలను మేపుతూ పడుతున్న అవస్థలను వీడియో ద్వారా కేటీఆర్‌కు పంపించాడు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఎండి సమీర్ అనే యువకుడు. సౌదీలో తాను పడుతున్న కష్టాలను ఏకరవు పెట్టిన ఆ యువకుడు మీరే ఆదుకోవాలంటూ కేసీఆర్‌ను వేడుకున్నాడు.
'సౌదీలో నన్ను సంపుతుండ్రు. ఏజెంట్ మోసంతో నరకయాతన పడుతున్నా.. 20 రోజులుగా తిండి లేదు. మీరే నన్ను కాపాడాలి' అని ఆ వీడియోలో సమీర్ పేర్కొన్నాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. సౌదీలో ఉన్న ఇండియా ఎంబసీకి సమీర్ గోడును నివేదించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







