పోర్చుగీస్ టీమ్ తో మన్మధుడు
- May 15, 2019
మన్మధుడు సీక్వెల్ గా వస్తున్న సినిమా మన్మధుడు 2. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లోని అందమైన లొకేషన్స్ లో జరుగుతున్నది. నాగార్జున హీరోగా చేస్తున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మన్మధుడు సినిమా క్లాసికల్ హిట్ అయ్యింది. ఆ క్లాసిక్ కు సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా తెరకెక్కుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో సమంత క్యామియో రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, పోర్చుగల్ లో అక్కడి టిమ్ తో కలిసి మన్మధుడు నాగార్జున ఫోటో దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో మన్మధుడు డైరీస్ పేరుతో పోస్ట్ చేశారు. పోర్చుగీస్ లో షూటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, మన్మధుడు 2 కు పనిచేసిన పోర్చుగీస్ యూనిట్ కు నాగార్జున థాంక్స్ చెప్తూ ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!