ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్ నిర్వహించి ఓ బాలిక తన ప్రాణాలు..

ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్ నిర్వహించి ఓ బాలిక తన ప్రాణాలు..

కొత్త టెక్నాలజీ కొత్త కొత్త సమస్యల్ని తీసుకు వస్తుంది. సెల్పీలతో ప్రాణాలు పోగొట్టుకునే వారు కొందరైతే, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాకీ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ రోడ్డు దాటేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోల్ నిర్వహించి దాని ప్రకారం ఆత్మహత్యకు పాల్పడింది ఓ బాలిక. అర్థాంతరంగా తనువు చాలించి అమ్మానాన్నకు కడుపుకోత మిగిల్చింది. టెక్నాలజీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సమాచారం చాలా ఈజీ అయిపోయింది. అయితే మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుందని కొందరు వాపోతున్నారు. దాన్ని మంచిపనికి వినియోగిస్తే మంచిదే. ప్రాణాలు తీసుకునే స్థితికి చేరుకుందంటే టెక్నాలజీ మనుషుల్ని ఎంత నాశనం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లే ప్రతి పనిలో మంచి చెడు రెండూ ఉంటాయి. కౌలాలంపూర్ సరవాక్‌కు చెందిన ఓ పదహారేళ్ల బాలిక ఇన్‌‌స్టాగ్రామ్‌లో తన స్నేహితులతో చాట్ చేస్తూ సరదా సంభాషణ సాగించింది. అందులో భాగంగానే ఓ పోల్ కండక్ట్ చేసింది. నేను చచ్చిపోతున్నాను అని మెసేజ్ పెట్టింది. దానికి చావు అంటూ సరదాగానే వాళ్లు కూడా పోస్ట్ పెట్టారు. అది కాస్తా సీరియస్ అయింది. బాలిక నిజంగానే ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించారు. స్పందించిన ఎంపీ రామ్ కర్పాల్ సింగ్, లాయర్.. పోల్‌లో పాల్గొని బాలికను చనిపోమంటూ ప్రోత్సహించిన వారందరి మీదా చర్యలు తీసుకోవాలని అన్నారు. వారే ఆమెకు అలాంటి చెత్త సలహా ఇచ్చారని అన్నారు. వారి సలహా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఊహించలేకపోయారు.

Back to Top