గణనీయంగా తగ్గిన రోడ్‌ యాక్సిడెంట్‌ రేట్‌

గణనీయంగా తగ్గిన రోడ్‌ యాక్సిడెంట్‌ రేట్‌

మస్కట్‌: ఒమన్‌ రోడ్లపై 2018లో ప్రతి మూడు గంటలకు ఓ రోడ్‌ యాక్సిడెంట్‌ నమోదయినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017తో పోల్చితే ఇది 27 శాతం తగ్గుదలగా అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ప్రతి రెండు గంటలకు ఓ యాక్సిడెంట్‌ నమోదయ్యేది. 2018లో మొత్తం 2,802 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2017లో ఈ సంఖ్య 3,845గా వుంది. 2017లో 640 మరణాలు సంభవిస్తే, 2018లో అది 6376గా నమోదయ్యింది. 2018లో 2,815 మంది గాయపడగా, 2017లో ఈ సంఖ్య 3,134. 2018లో మొత్తం 396 మంది ఒమనీయులు, 239 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. 2018 చివరి నాటికి మొత్తం 1.15 మిలియన్‌ వాహనాలు రిజిస్టర్‌ అలయ్యాయి.  

 

Back to Top