థాయ్‌లాండ్:చిన్నారి నిద్రలో నడుస్తూ.. 11వ అంతస్తు నుంచి..
- May 17, 2019ఒక్క అంతస్తు నుంచి కింద పడితేనే ఒక్కోసారి ప్రాణాపాయం సంభవిస్తుంది. అలాంటిది, 11వ అంతస్తు నుంచి పడిపోతే, బతికే ఛాన్స్ ఏమాత్రం ఉండదు. కానీ థాయ్‌లాండ్ లో ఓ చిన్నారి 11వ అంతస్తు నుంచి కిందపడినప్పటికీ ప్రాణాలతో బయటపడింది. మృత్యుంజయురాలిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీచా సూక్పలం అనే వ్యక్తి తన కుమార్తెతో కలిసి థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణానికి వెళ్లాడు. వీరిద్దరూ అక్కడే ఓ హోటల్‌లో బస చేశారు. ఐతే, దీచా కుమార్తెకు నిద్రలో నడిచే అలవాటుంది. దాంతో ఆమె నిద్రలో నడుస్తూ నేరుగా బాల్కనీ వైపు వెళ్లి గోడపైకి ఎక్కి వేలాడింది. కాసేపు గోడపై వేలాడిన చిన్నారి పట్టు తప్పడంతో 11వ అంతస్తు నుంచి పడిపోయింది. దాంతో ఆ పాప గట్టిగా కేకలు పెట్టింది. హోటల్ సిబ్బంది వచ్చేసరికే ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గాయాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్