బొప్పాయి ఆకుల్లో ఎన్ని ఔషధ గుణాలో..
- May 18, 2019
బొప్పాయి పండు శరీరానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసు. కానీ బొప్పాయి ఆకుల్లో కూడా ఔషధగుణాలు మెండుగా ఉన్నాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. మన శరీరానికి కావల్సిన విటమిన్లు, పోషకాలు బొప్పాయి ఆకుల్లో ఉంటాయి. కాబట్టి బొప్పాయి ఆకులతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
ప్రాణాంతక వ్యాధి డెంగ్యూని నివారించడానికి బొప్పాయితో పాటు ఆకులు కూడా దివ్యంగా పనిచేస్తాయట. ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే డెంగ్యూని నివారించొచ్చు. బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్స్ రక్తంలోని ప్లేట్ లెట్ కౌంట్‌ని పెంచుతాయి. అంతే కాకుండా రక్తం గడ్డకట్టకుండానూ చూస్తుంది. కాలేయ పని తీరుని మెరుగుపరుస్తుంది.
మన శరీరంలో ఫంగస్, వార్మ్స్, పరాన్న జీవులు, ఇతర క్యాన్సర్ సెల్స్ వంటి అతి సూక్ష్మక్రిములు వృద్ధి చెందకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు బొప్పాయి ఆకులో ఉన్నాయి. జలుబు, ప్లూ వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణం బొప్పాయి ఆకుల రసంలో ఉంది. ఈ రంసలో ఉండే అమైనో ఆమ్లాలు, ఫినిలాలైన్, లైసిన్,హిస్టిడైన్, టైరోసిన్, అలనిన్ వంటి ఎంజైమ్స్ యాంటీ ఏజింగ్‌లా పనిచేస్తుంది.
మొటిమలతో బాధపడేవారికి బొప్పాయి ఆకు ఎంతో మేలు చేస్తుంది. ముందుగా ఆకులు ఎండబెట్టి మెత్తని పొడి చేసుకోవాలి. దీనికి కొంచెం నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా మొటిమలు తగ్గేంత వరకు రోజూ చేస్తుంటే మొటిమలు, వాటి తాలూకు వచ్చిన మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా చర్మవాధులను నివారించే గుణం కూడా బొప్పాయి ఆకుల్లో ఉంది.
మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పిని ఈ ఆకుల రసం తగ్గిస్తుంది. ఇందుకోసం ఒక బొప్పాయి ఆకుని తీసుకుని దానికి ఉప్పు, కొద్దిగా చింతపండు రసం తీసుకుని గ్లాసుడు నీళ్లు పోసి బాగా ఉడికించాలి. నీరు సగం అయిన తరువాత దించి వడగట్టి తాగాలి.
బొప్పాయి ఆకుల్లో కాల్షియం, విటమిన్ సి, విటమిన్ కె ఉంటాయి. ఎముకలు దృఢంగా మారడానికి తోడ్పడుతుంది. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి ని పొందలేకపోతున్నాము. కానీ బొప్పాయి ఆకు రసాన్ని ఒక స్పూన్ తీసుకున్నా ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసినంత డి విటమిన్ అందుతుంది.
బొప్పాయి పండు, ఆకుల్లో కూడా యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్యాక్రియాటిక్ క్యాన్సర్, లివర్, లంగ్ క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడేలా చేస్తూ వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో బొప్పాయి ఆకులు సహాయపడతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఇన్సులిన్‌ని క్రమబద్దీకరిస్తూ, మూత్ర పిండాలు దెబ్బతినకుండా కాపాడుతాయి.
ఫ్యాటీ లివర్ సమస్యను నివారిస్తుంది.
తలలో ఉన్న చుండ్రుని బొప్పాయి ఆకుల రసం నివారిస్తుంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







