సీనియర్ నటులు రాళ్ళపల్లి ఇకలేరు
- May 18, 2019
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటులు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రాళ్లపల్లి 1955 అక్టోబర్ 10న తూర్పు గోదావరి జిల్లాలోని రాచపల్లిలో జన్మించారు. 1979లో కుక్కకాటుకు చెప్పు దెబ్బ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆయన 850 సినిమాల్లో నటించారు. రాళ్లపల్లి చిన్నతనం నుంచే నాటకాలు వేసేవారు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు అందుకొన్నారు. రాష్ట్ర నంది పురస్కారాన్ని మూడుసార్లు అందుకొన్నారు. 1976లో ఊరుమ్మడి బతుకులు చిత్రంలో నటనకు గాను ఉత్తమ కామెడీ నటుడిగా జాతీయ అవార్డును అందుకొన్నారు. గణపతి అనే సీరియల్‌లో ఉత్తమ సహయనటుడిగా నంది అవార్డును పొందారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!