సంచలనం.. పుల్వామా ఉగ్రదాడి వెనుక మన జవాన్..
- May 18, 2019
పాకిస్థాన్‌కు చెందిన యువతి పన్నిన వలలో చిక్కిన ఒక భారత జవాను, సైనిక రహస్యాలను ఆమెకు, తద్వారా పాక్ ఉగ్రవాదులకు అందించాడు. ఆ సమాచారంతోనే ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి, 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు.మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేకదళం, కేంద్ర నిఘా సంస్థలు చేసిన దర్యాప్తులో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలో బీహర్ రెజిమెంటలో నాయక్ క్లర్కుగా అవినాశ్ కుమార్ అనే యువకుడు పని చేసేవాడు. 2018లో అతడిని అసోంకు బదిలీ చేశారు. ఆ సమయంలో అతడికి వాట్సాప్ లో ఓ పాకిస్థాన్ యువతితో పరిచయం ఏర్పడింది. తన అందచందాలతో అవినాశ్‌ను వలలో వేసుకున్న ఆ యువతి.. సైనిక రహస్యాలను అతడి వద్ద కూపీ లాగి ఉగ్రవాదులకు చేరవేసేది.
అవినాశ్ ఇచ్చిన సమాచారంతో పక్కా ప్రణాళిక రచించుకున్న ముష్కరులు.. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అవినాశ్ బ్యాంక్ ఖాతాలో పాకిస్థాన్ నుంచి 50వేల రూపాయల నగదు కూడా జమ అయ్యిందని దర్యాప్తులో తేలింది. భోపాల్‌లోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అవినాశ్ తండ్రి కూడా జవానే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!