భారతీయ వలసదారుడి ఆత్మహత్య

భారతీయ వలసదారుడి ఆత్మహత్య

కువైట్‌: బెడ్‌ షీట్‌తో ఉరి వేసుకుని ఓ భారతీయ వలసదారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్పాన్సర్‌ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వయసు 30 ఏళ్ళు వుండొచ్చని అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌కి అప్పగించారు. సాద్‌ అల్‌ అబ్దుల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పాన్సరర్‌ ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకుని, సీలింగ్‌కి వేలాడుతున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పారామెడిక్స్‌, పోలీస్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికే 30 ఏళ్ళ భారతీయ వలసదారుడు మృతి చెంది వున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.  

Back to Top