మహిళా షాపర్స్‌కి అజ్మన్‌ పోలీస్‌ సూచన

మహిళా షాపర్స్‌కి అజ్మన్‌ పోలీస్‌ సూచన

అజ్మన్‌ పోలీస్‌, మహిళా షాపర్లకు సూచన చేశారు. తమ వ్యక్తిగత వస్తువుల్ని షాపింగ్‌ కార్ట్‌లలో వుంచేటప్పుడు అప్రమత్తంగా వుండాలని ఆ సూచనలో పేర్కొన్నారు. షాపింగ్‌ ట్రాలీల్లో పర్సనల్‌ బ్యాగ్స్‌ని పెడితే, అది దొంగలకు సేఫ్‌ టార్గెట్‌ అవుతుందని అజ్మన్‌ పోలీసులు చెబుతున్నారు. షాప్‌లో వస్తువులు కొంటున్నట్లుగా నటిస్తూ దొంగతనాలకు పాల్పడేవారు ప్రధానంగా షాపింగ్‌ ట్రాలీల్లో వుండే బ్యాగులపైనే దృష్టిపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు వివరించారు. పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా కుటుంబంతో కలిసి షాపింగ్‌ చేయడం ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారు. 

Back to Top