రమదాన్ రేసులపై ఉక్కుపాదం
- May 22, 2019
అబుధాబి మరియు దుబాయ్ పోలీస్ సంయుక్తంగా రెక్లెస్ డ్రైవింగ్, ప్రమాదకరమైన రీతిలో రోడ్లపై రేసులు నిర్వహించడం, పాల్గొనడంపై ప్రకటన విడుదల చేశారు. పవిత్ర రమదాన్ మాసంలో యువ మోటరిస్టులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటారనీ, అలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. ఎక్కువగా అర్థరాత్రి వేళల్లో ఈ రేసులు ప్రారంభమయి, తెల్లవారు ఝాము వరకు కొనసాగుతుంటాయని 'అల్ పుజ్రయాత్' రేసుల పేరుతో వీటిని నిర్వహిస్తుంటారని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యపూరితంగా వాహనాలు నడిపేవారికి 2,000 వరకు దిర్హామ్‌ల జరీమానాతోపాటు 23 బ్లాక్ పాయింట్స్ వరకు లైసెన్స్‌పై విధించే అవకాశముంది. ఉల్లంఘనలకు పాల్పడినవారి వాహనాన్ని 60 రోజులపాటు ఇంపౌండ్ కూడా చేస్తారు. సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు పోలీసులు. తల్లిదండ్రులు, తమ పిల్లల విషయమై అప్రమత్తంగా వుండాలని దుబాయ్, అబుధాబి పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు