రమదాన్‌ రేసులపై ఉక్కుపాదం

రమదాన్‌ రేసులపై ఉక్కుపాదం

అబుధాబి మరియు దుబాయ్‌ పోలీస్‌ సంయుక్తంగా రెక్లెస్‌ డ్రైవింగ్‌, ప్రమాదకరమైన రీతిలో రోడ్లపై రేసులు నిర్వహించడం, పాల్గొనడంపై ప్రకటన విడుదల చేశారు. పవిత్ర రమదాన్‌ మాసంలో యువ మోటరిస్టులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటారనీ, అలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. ఎక్కువగా అర్థరాత్రి వేళల్లో ఈ రేసులు ప్రారంభమయి, తెల్లవారు ఝాము వరకు కొనసాగుతుంటాయని 'అల్‌ పుజ్రయాత్‌' రేసుల పేరుతో వీటిని నిర్వహిస్తుంటారని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యపూరితంగా వాహనాలు నడిపేవారికి 2,000 వరకు దిర్హామ్‌ల జరీమానాతోపాటు 23 బ్లాక్‌ పాయింట్స్‌ వరకు లైసెన్స్‌పై విధించే అవకాశముంది. ఉల్లంఘనలకు పాల్పడినవారి వాహనాన్ని 60 రోజులపాటు ఇంపౌండ్‌ కూడా చేస్తారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ మేరకు క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు పోలీసులు. తల్లిదండ్రులు, తమ పిల్లల విషయమై అప్రమత్తంగా వుండాలని దుబాయ్‌, అబుధాబి పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

Back to Top