ఇండోనేసియా: సెగలు కక్కుతున్న అగ్ని పర్వతం

ఇండోనేసియా: సెగలు కక్కుతున్న అగ్ని పర్వతం

జకార్తా : ఇండోనేసియాలోని ఆగంగ్‌ అగ్ని పర్వతం సెగలు కక్కుతూ భారీయెత్తున బూడిదను వెలువరిస్తున్న నేపథ్యంలో బాలి, ఆస్ట్రేలియా మధ్య అనేక విమాన సర్వీసులను రద్దుచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ అగ్ని పర్వతం వెలువరిస్తున్న బూడిద 4,600 మీటర్ల ఎత్తున పేరుకుపోవటంతోపాటు, దీని నుండి వెలువడుతున్న లావా కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించిందని అధికారులు చెప్పారు. పర్వత శిఖరం నుండి రాళ్లు, కొండ చరియలు కొన్ని కి.మీదూరం మేర ఎగిరిపడుతున్నాయన్నారు. తూర్పు బాలిలో వున్న ఆగంగ్‌ అగ్ని పర్వతం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7.22 గంటల నుండి విస్ఫోటనం చెందిందని, ఈ విస్ఫోటనాలు దాదాపు 4 నిముషాలు కొనసాగాయని అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు 50 వేలకుపైగా మాస్క్‌లను అందుబాటులో వుంచామని అధికారులు వివరించారు.అగ్నిపర్వతం రగులుతున్నప్పటికీ ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణనష్టం, లేదా ప్రజల తరలింపు వంటివి లేవని తెలుస్తోంది.

Back to Top