మోడీని కలిసిన జగన్

- May 26, 2019 , by Maagulf
మోడీని కలిసిన జగన్

దిల్లీ‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైకాపా శాసనసభాపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్న జగన్‌.. నేరుగా లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్‌ ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంవంటి అంశాల్ని జగన్‌ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

మోదీని కలిసిన జగన్‌ బృందంలో లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ఉన్నారు. రాజమహేంద్రవరం, బాపట్ల ఎంపీలు మార్గాని భరత్‌, నందిగం సురేశ్‌తోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నారు.

మోదీతో భేటీ అనంతరం జగన్‌ ప్రధాని నివాసం నుంచి ఏపీ భవన్‌కు చేరుకుంటారు. అనంతరం ఏపీ భవన్‌ సిబ్బందితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. స్థానికంగా తనను కలవడానికి వచ్చేవారితోనూ జగన్‌ మాట్లాడనున్నారు. దిల్లీలోని ఏపీ క్యాడర్‌ అధికారులు ఆయన్ని కలవనున్నారు. మధ్యాహ్న భోజనం ఏపీ భవన్‌లోనే చేసి సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారని ఏపీ భవన్‌ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ నుంచి ఆయన తిరుపతికి వెళ్లి అక్కడే బస చేయనున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com