స్మార్ట్‌గా పోకిరీని పట్టించిన మహిళ
- May 30, 2019కువైట్: పోలీసులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నందుకుగాను అరెస్ట్ చేశారు. కేసు వివరాల్లోకి వెళితే కువైటీ మహిళ ఒకరు తనను వేధిస్తోన్న ఓ వ్యక్తికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తాను ఎక్కడికి వెళితే అక్కడకు వచ్చి తనను వేధిస్తున్న ఆ పోకిరీని పోలీసులకు అప్పగించేందుకు స్మార్ట్‌గా ఆలోచించింది. ఆ పోకిరీ చేష్టలకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు నటిస్తూ, అతని ఫోన్ నెంబర్ని తీసుకుంది. అతని డిమాండ్లకు ఒప్పుకుంటున్నట్లుగా ఫోన్ చేసి, మరోపక్క పోలీసులకు ఈ విషయమై సమాచారమిచ్చింది. పోలీసులు ఆ సమాచారంతో పోకిరీని అరెస్ట్ చేశారు. పోలీసులకు బాధితురాలు ఫోన్ నెంబర్ ఇవ్వడంతో అతన్ని చాకచక్యంగా పట్టుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్