స్మార్ట్‌గా పోకిరీని పట్టించిన మహిళ

స్మార్ట్‌గా పోకిరీని పట్టించిన మహిళ

కువైట్‌: పోలీసులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నందుకుగాను అరెస్ట్‌ చేశారు. కేసు వివరాల్లోకి వెళితే కువైటీ మహిళ ఒకరు తనను వేధిస్తోన్న ఓ వ్యక్తికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తాను ఎక్కడికి వెళితే అక్కడకు వచ్చి తనను వేధిస్తున్న ఆ పోకిరీని పోలీసులకు అప్పగించేందుకు స్మార్ట్‌గా ఆలోచించింది. ఆ పోకిరీ చేష్టలకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు నటిస్తూ, అతని ఫోన్‌ నెంబర్‌ని తీసుకుంది. అతని డిమాండ్లకు ఒప్పుకుంటున్నట్లుగా ఫోన్‌ చేసి, మరోపక్క పోలీసులకు ఈ విషయమై సమాచారమిచ్చింది. పోలీసులు ఆ సమాచారంతో పోకిరీని అరెస్ట్‌ చేశారు. పోలీసులకు బాధితురాలు ఫోన్‌ నెంబర్‌ ఇవ్వడంతో అతన్ని చాకచక్యంగా పట్టుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

 

Back to Top