కారులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
- May 30, 2019
యూ.ఏ.ఈ:ఐదేళ్ళ బాలుడు, కారులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయాడు. పాత కారులోకి వెళ్ళిన చిన్నారి, ఆ కారు లాక్ అయిపోవడంతో అందులోనే వుండిపోయాడు. గాలి ఆడక బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అల్ అయిన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట బాలుడు తప్పిపోయాడని అంతా అనుకున్నారు. అయితే గాలింపు చేపట్టిన పోలీసులకు బాలుడ్ని అత్యంత విషమ స్థితిలో కారులో కనుగొన్నారు. హుటాహుటిన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే చాలా సేపటినుంచి పూర్తిస్థాయిలో ఊపిరి ఆడకపోవడంతో బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల అప్రమత్తంగా వుండాలనీ, ప్రత్యేకంగా కార్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







