కారులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
- May 30, 2019యూ.ఏ.ఈ:ఐదేళ్ళ బాలుడు, కారులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయాడు. పాత కారులోకి వెళ్ళిన చిన్నారి, ఆ కారు లాక్ అయిపోవడంతో అందులోనే వుండిపోయాడు. గాలి ఆడక బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అల్ అయిన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట బాలుడు తప్పిపోయాడని అంతా అనుకున్నారు. అయితే గాలింపు చేపట్టిన పోలీసులకు బాలుడ్ని అత్యంత విషమ స్థితిలో కారులో కనుగొన్నారు. హుటాహుటిన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే చాలా సేపటినుంచి పూర్తిస్థాయిలో ఊపిరి ఆడకపోవడంతో బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల అప్రమత్తంగా వుండాలనీ, ప్రత్యేకంగా కార్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..