యు.ఏ.ఈ లో నేటి నుంచి నిషేధం లేని కార్మిక చట్టాలు

- January 03, 2016 , by Maagulf
యు.ఏ.ఈ లో  నేటి నుంచి నిషేధం లేని కార్మిక చట్టాలు

ఉద్యోగ ఒప్పందాలు , పని అనుమతులు , కార్మికుల నియమాలు, తొలగింపులు తదితర కొత్త చట్టాలు నేటి నుంచి అమలులోనికి రానున్నాయి. ఈ  నూతన నిబంధనల ప్రకారం ఇక 6 నెలల కార్మిక నిషేధం ఉండదు.  కార్మికుడు , యజమానికి మధ్య ఒక పరస్పర అవగాహనతో ఉద్యోగ తొలగింపు ఉంటె, 6 నెలల నిషేధం ఉండదు. కొత్త నియమాల  ప్రకారం యజమాని మరియు ఉద్యోగుల మధ్య ఒక శక్తివంతమైన ఉత్పాదక సంబంధం బలోపేతం కావడానికి రూపకల్పన చేశారు. ఇరు పక్ష్యాల్ మధ్య ఉన్నసమ్మతిదారుడు స్థానికంగా గాని , విదేశాల నుంచి కార్మికులను నియమించుకొనే అవకాశం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రామాణిక కార్మిక ఒప్పందాలకు సంబంధించినవి ఉండాలి.  

  కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి యజమాని ఒక కోటా ను పొంధడానికై దరఖాస్తు చేయాల్సి ఉంది. ఆ  దరఖాస్తులో తాను కార్మికునికి ఇవ్వబోయే ఉద్యోగం గురించి ఒక సంపూర్ణ వివరణతో పాటు రెండు పక్ష్యాల విధులు హక్కులను గూర్చి పొందుపరచాలి. దీనిని ' తశ్హెల్ కేంద్రం  '  ద్వారా సమర్పించాలి. కార్మికులు కనుక యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో ఉంటె , యజమాని అనుమతిపత్రంతో పాటు నియమించబడిన కార్మికుని  సంతకం తీసుకోవాలి. యజమాని కార్మికునికి సంబంధించిన వర్క్ పర్మిట్ కోసం ఒక పత్రాన్నిజత చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలు పూర్తి కాబడిన తర్వాత  కార్మికుడు లేక కార్మికురాలు 14 రోజులలో ఆ వర్క్ కాంట్రాక్ట్ పై సంతకం చేయాలి.

                          కొత్త ఉపాధి పరిమితి కాల ఒప్పందాలు :

   *    గడువు ముగిసినప్పటకి ఒప్పందం పునరుద్దరణ కాబడక పోవడం 
  
   *   యజమాని కార్మికుడు పరస్పర అంగీకారంతో 6 నెలల కాలాన్ని పూర్తి చేయడం 
 

   *  యజమాని ఉద్యోగ ఒప్పందం ప్రోస్థాహించడం.


                          అపరిమిత కాలంలో ఒప్పందాలు 
     
 
     *    కార్మికుడు 6 నెలల కాలం పని చేసి ఉంటె, ఇరువురి అంగీకారంతో ( యజమాని , కార్మికుడు ) 
        ఒప్పందంను రద్దు చేసుకోవచ్చును. 

    *  రెండు పక్ష్యాలాలో ఎవరైనా ఒకరు  పని ముగిస్తున్నామని అవతలవారికి నోటీసు ఇవ్వడం 
  

    *  యజమాని కార్మికుని తొలగింపునకు ముందే లేక ఇతర కారణంగా ఒప్పందం రద్దు కాబడుతుంది.   

 

--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com