జూన్ 27న విడుదలకు సిద్ధం అవుతున్న 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'
- June 05, 2019
అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఎయిర్‌టెల్ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి రవి, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ కీలక పాత్రధారులుగా రూపొందుతోన్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన కల్పిత కథాంశంతో.. 'వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత' వంటి సెన్సిబుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అడివి సాయికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అఫిషియల్‌గా ప్రకటించింది. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. ఓ సినిమాలో పనిచేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఓ సినిమా నిర్మాణంలో భాగమవడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా దర్శకుడు సాయికిరణ్ అడివి మాట్లాడుతూ... ''సినిమాలో అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్ నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సరికొత్త కాన్సెప్ట్‌తో, నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ ఇది. చిత్రాన్ని జూన్ 27న భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..''అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..