సౌదీ అరేబియాకి అమెరికా అణువిద్యుత్ సమాచారం
- June 06, 2019
సౌదీఅరేబియాకు అవసరమైన అణు విద్యుత్ సమాచారాన్ని అందజేేసేందుకు రెండు అమెరికన్ కంపెనీలకు ట్రంప్ సర్కారు అనుమతి మంజూరు చేసింది. ఇరాన్ అణు కార్యక్రమంపై కస్సుబస్సులాడుతున్న ట్రంప్ ప్రభుత్వం సౌదీ అరేబియాకు అణు విద్యుత్ పేరుతో ఈ సమాచారాన్ని చేరవేస్తుండడం గమనార్హం. ఖషోగీ హత్య తరువాత కూడా సౌదీ సర్కారుకు ట్రంప్ సన్నిహితంగా మెలగడంపై అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సౌదీ తన అణు విద్యుత్ రియాక్టర్లను అభివృద్ధి చేసుకునేందుకు పెద్దయెత్తున సహాయాన్ని అందించే విషయంపై ఇరుదేశాల మధ్య 2017 నుండి జరుగుతున్న చర్చలు ఈ అనుమతులతో ఒక కొలిక్కి వచ్చినట్లయింది. వ్యాపార ప్రయోజనాల భద్రత రీత్యా ఈ సమాచారాన్ని అత్యంత గోప్యంగా వుంచాలని అమెరికా విద్యుత్ శాఖ సౌదీ అరేబియా ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ అనుమతులిచ్చిన కంపెనీల పేర్లను అమెరికా విద్యుత్ శాఖ వెల్లడించేందుకు నిరాకరించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









